రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి
కాకతీయ, చేర్యాల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు ప్రతీ రైతుకు అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుతోపాటు ఈకేవైసీ తప్పనిసరి చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కే.స్వరూపరాణి సూచించారు. చేర్యాల మండలంలో రైతులు పడుతున్న ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ నాయకులు మంగళవారం చేర్యాల డివిజన్ వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి కే.స్వరూపరాణిని కలిసి కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంతంలో రైతులకు అందుబాటులో అన్ని ఫర్టిలైజర్ షాపుల్లో ఎరువులు, యూరియూ కొరత లేకుండా చూడాలన్నారు. ఈ విషయమై డీఏఓ స్వరూప రాణి సానుకూలంగా స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. వారి వెంట చేర్యాల డివిజన్ వ్యవసాయ అధికారి రాధిక, చేర్యాల, మద్దూరు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పులి భోగేశ్వర్, బూరెల రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, జిల్లా నాయకులు మల్లం అంజయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


