epaper
Monday, March 2, 2026
epaper

గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా

గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా

పదేళ్లలో జీపీ నుంచి మున్సిపాలిటీ..
మూడుసార్లు మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ దే
గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బీఆర్‌ఎస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి

కాకతీయ, గజ్వేల్ : పదేళ్లలో గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధే తమకు ప్రధాన బలం అని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడం, వరుసగా మూడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ప్రజల మద్దతుకు నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2014లో సుమారు 15 వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీగా ఉన్న గజ్వేల్ నేడు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారాయి. వరుసగా మూడు విడతల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంది. అందుకే గజ్వేల్ గడ్డ, కేసీఆర్ అడ్డా అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో దాదాపు 90 శాతం సీసీ రహదారులు, 80 శాతం భూగర్భ డ్రైనేజీ పనులు, మహతి ఆడిటోరియం, ఆర్డీవో కార్యాలయం, ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేశాం అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతోంది అని తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కౌన్సిలర్లను ఒక్కొక్కరిని కోటి రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నారు అని ఆరోపించారు. ఈ విషయంపై రఘునందన్ రావు దమ్ముంటే గజ్వేల్ కోట మైసమ్మ తల్లి సాక్షిగా వచ్చి ప్రమాణం చేయాల‌ని అన్నారు. ప్రజలు నమ్మి వేసిన ఓట్లను వ్యాపారంగా మార్చడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. రాబోవు ప‌రిష‌త్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు. సిద్దిపేట జిల్లాలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుంద‌ని, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావ‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి, మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి త‌దిత‌రులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img