పేద కుటుంబానికి యలమందల చేయూత
నిత్యావసర సరుకులు, బియ్యం, నగదు అందజేత
సేవాభావానికి గ్రామస్తుల ప్రశంసలు
కాకతీయ, ఖమ్మం: ఆపదలో ఉన్న ఓ పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, నగదు అందజేసి నాయి బ్రాహ్మణ నగర అధ్యక్షులు యలమందల జగదీష్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం అర్బన్ మండలం కైకొండాయిగూడెం 1వ డివిజన్‌కు చెందిన ఆంగోత్ భద్రు అంధుడు కాగా, ప్రమాదంలో కాలికి ఇన్ఫెక్షన్ రావడంతో నడవలేని పరిస్థితిలో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న యలమందల జగదీష్ మంగళవారం భద్రు కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం, రూ.2 వేల నగదు అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. పేద కుటుంబాన్ని ఆదుకున్న జగదీష్ సేవలు ఆదర్శప్రాయమని స్థానికులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భద్రు నాయక్, అన్వర్ పాషా, ఆంగోతు కిషోర్, తేజావత్ రాంకోటి, వీరస్వామి, పుల్లయ్య, శ్రీనివాస్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.


