శివాలయం హుండీ ఆదాయం రూ.13.74 లక్షలు
గత ఏడాదితో పోలిస్తే రూ.1.44 లక్షలు అధిక వసూళ్లు
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని పురాతన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఆలయ ఈఓ శ్రీకాంత్, చైర్మన్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ, అర్చనలు, కళ్యాణ కట్నం, దుకాణాల బహిరంగ వేలం, షాపుల అద్దెలు, భక్తుల విరాళాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అధికారుల సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయానికి మొత్తం రూ.13 లక్షల 74 వేల 735 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది మహాశివరాత్రి ఆదాయంతో పోలిస్తే ఈసారి రూ.1 లక్ష 44 వేల మేర అధికంగా వసూళ్లు నమోదైనట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు దేవస్థానంలో అధికారుల సమక్షంలో పూర్తి ఆదాయం, ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.


