ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తాం
సీపీఐకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
కాకతీయ,కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సీపీఐకి ఘనవిజయం అందించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్, కార్పొరేటర్ల పనితీరు ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా తెలిపారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని కృషితో కార్పొరేషన్ సాధ్యమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేపడతామని తెలిపారు. గెలుపు, ఓటములను పక్కనబెట్టి పార్టీలకతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. మేయర్‌గా మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా సిరిపురపు లలిత కుమారి బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. సిపిఐకి 23 కార్పొరేటర్ స్థానాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను అభినందించారు.


