బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు
మధిర చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత ఎన్నికపై హర్షం
కాకతీయ,మధిర: మధిర పట్టణ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోందని, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు తెలిపారు. మధిర మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన స్పందించారు. మధిర మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఇల్లందులపాడు గ్రామానికి చెందిన సామినేని సుజాత రామనాథం ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. ఈ ఎన్నికలో ఆమెకు అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆమోద ముద్రగా నిలిచాయని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో మధిర నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మధిరను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.


