epaper
Monday, March 2, 2026
epaper

మధిరను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం

మధిరను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం
‘నో పాలిటిక్స్ – ఓన్లీ డెవలప్‌మెంట్’తో ముందుకు వెళ్లాలి
త్వరలో రాజకీయాలకు అతీతంగా ‘డెవలప్‌మెంట్ కమిటీ’ ఏర్పాటు
కాంగ్రెస్–టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా
ప్రతి 15 రోజులకు అభివృద్ధి పనులపై స్వయంగా సమీక్షిస్తా
ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కాకతీయ, మధిర : మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా, నివసించడానికి అత్యంత అనుకూలమైన ‘మోడల్ టౌన్’గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం నూతన పాలకవర్గం ఎన్నిక నేపథ్యంలో మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోమని భరోసా ఇచ్చారు. మధిర పట్టణ అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పారదర్శక పాలన, సంక్షేమం, అభివృద్ధి అనే మూడు సూత్రాలతో ముందుకు సాగుతామని తెలిపారు. కాంగ్రెస్–టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని వెల్లడించారు.

రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధే లక్ష్యం

పదవులు చేపట్టిన అనంతరం రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు డిప్యూటీ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “ఇకపై మధిరలో రాజకీయాలు కాదు… అభివృద్ధే ప్రధాన లక్ష్యం కావాలి. ‘నో పాలిటిక్స్ – ఓన్లీ డెవలప్‌మెంట్’ అనే నినాదంతో పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దాలి” అని సూచించారు. పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన పాలకవర్గాన్ని ఆదేశించారు.

ప్రత్యేక డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటు

మధిరను భవిష్యత్తు తరాలకు ఆదర్శ పట్టణంగా మార్చేందుకు రాజకీయాలకు అతీతంగా ఒక ప్రత్యేక ‘డెవలప్‌మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. పట్టణంలోని మేధావులు, నిపుణులు, ప్రముఖులను ఈ కమిటీలో భాగస్వామ్యం చేసి అభివృద్ధికి అవసరమైన సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఈ కమిటీ సూచనలతో పట్టణ రూపురేఖలను పూర్తిగా మార్చి రాష్ట్రంలోనే మధిరను ఒక మోడల్ టౌన్‌గా నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి స్వయంగా సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.

ఓటర్ల విశ్వాసమే ప్రభుత్వ బలం

ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం, ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని అన్నారు. మధిర పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండ బాలకోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన దని కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మొత్తంగా మధిర పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుండటం పట్టణ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img