epaper
Monday, March 2, 2026
epaper

*చేర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేరు ఖరారు*

చేర్యాల పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి
చైర్‌పర్సన్‌గా ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా మెడిశెట్టి ఉమ ఖరారు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ
ఎస్సీ మహిళా రిజర్వేషన్‌లో చైర్‌పర్సన్‌గా అరుణ ఎంపిక
వైస్ చైర్మన్ పదవికి మెడిశెట్టి ఉమ పేరు ఖరారు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారిక ప్రకటన
మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్‌కు 5 స్థానాలు
నేడు ప్రమాణ స్వీకారం అనంతరం అధికారిక ఎన్నిక ప్రక్రియ

కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో మున్సిపల్ పీఠం ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా 6వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్‌గా 10వ వార్డు కౌన్సిలర్ మెడిశెట్టి ఉమ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ తరఫున ఈ రెండు కీలక పదవులకు అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటించినట్లు తెలిసింది. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటగిరీలో చైర్‌పర్సన్ పదవి ఉండటంతో ముస్త్యాల అరుణను ఎంపిక చేశారు. అలాగే పార్టీ బలాబలాలను, స్థానిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వైస్ చైర్మన్ పదవికి మెడిశెట్టి ఉమను ఎంపిక చేశారు.

బీఆర్ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం

చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో చైర్‌పర్సన్ ఎన్నిక బీఆర్ఎస్‌కు లాంఛనప్రాయంగా మారింది. పార్టీ నిర్ణయం ప్రకారం ఎంపికైన అభ్యర్థులు అధికారికంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

నేడు ప్రమాణ స్వీకారం… అధికారిక ఎన్నిక

ఎన్నికైన 12 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కోసం చేర్యాల పాత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనంగా పూర్తికానుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img