భక్తుల కోసం ఉచిత ఆటోలు ఏర్పాటు చేసిన వజ్ర హాస్పిటల్ యాజమాన్యం
కాకతీయ , కూసుమంచి :కూసుమంచి మండల కేంద్రంలోని పురాతన శివాలయంకు వచ్చే భక్తులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండల కేంద్రంలోని వజ్ర హాస్పిటల్ యాజమాన్యం ఇంటూరి నాగరాజు చౌదరి ఆధ్వర్యంలో 20 ఆటోలను ఏర్పాటు చేశారు. శివాలయంకు వచ్చే మహిళలు , వృద్ధుల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఉచితంగా ఆలయం వరకు ప్రయాణ ఏర్పాట్లు చేశారు.. వారే కాకుండా శివాలయంకు వచ్చే భక్తుల కోసం కూడా ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు.. దీంతో వజ్ర హాస్పిటల్ యాజమాన్యం ఇంటూరి నాగరాజు చౌదరి కి పలువురు నుండి అభినందనలు వస్తున్నాయి..


