సింగరేణి చైర్మన్‌కు ఘన సన్మానం
ఏఐటీయూసీ నాయకుల మర్యాదపూర్వక కలయిక
నూతన బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్ జ్యోతికి అభినందనలు
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి సంస్థ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్ జ్యోతిని ఏఐటీయూసీ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం సింగరేణి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి చైర్మన్ సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, షేక్ బాజీ, సైదా తదితరులు పాల్గొన్నారు.


