epaper
Monday, March 2, 2026
epaper

కల్లూరు పీఠంపై కాంగ్రెస్‌లో హోరాహోరీ

కల్లూరు పీఠంపై కాంగ్రెస్‌లో హోరాహోరీ
చైర్మన్ పదవిపై ముగ్గురు ఆశావహుల మధ్య తీవ్ర పోటీ
ఉన్నత నాయకత్వం చుట్టూ ముమ్మర లాబీయింగ్
వైస్ చైర్మన్ పదవిపైనా ఉత్కంఠ

కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ, చైర్మన్ పదవిపై పార్టీలో అంతర్గత పోటీ తీవ్రంగా మారింది. మొత్తం 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎస్టీ వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించడంతో చైర్మన్ పదవిపై వారి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆశావహులు పార్టీ ఉన్నత నాయకత్వాన్ని సంప్రదిస్తూ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. స్థానికంగా మద్దతు సమీకరణలు చేసుకోవడంతో పాటు, పార్టీ కీలక నేతల అనుకూలత కోసం లాబీయింగ్ కొనసాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వైస్ చైర్మన్ పదవిపైనా ఆశావహుల దృష్టి
చైర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ పదవిపైనా పలువురు నేతలు ఆశలు పెట్టుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పదవుల కేటాయింపులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, పార్టీ ఉన్నత నాయకత్వం కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది. పార్టీ అంతర్గత సమీకరణాలు, సామాజిక సమతుల్యత, నాయకత్వ నిర్ణయం ఆధారంగానే తుది ఎంపిక ఉండే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img