పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి
ఆంధ్రకు చెందిన వ్యక్తిగా గుర్తింపు.
కాకతీయ , కూసుమంచి : పాలేరు చెరువులోకి కారు దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది . స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని చెరువులోకి ఉదయం 7 గంటల సమయంలో కారు దూసుకెళ్లి నీటిలో మునిగింది. ఈ ఘటనలో కారు వెనకాల కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు. అయితే ముందు సెట్లో ఉండాల్సిన డ్రైవర్ మాత్రం కనపడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు . కారు చెరువులోకి దూసుకెళ్లిన తర్వాత బయటికి వచ్చే ప్రయత్నం చేసి ఉంటాడా లేక చెరువులో మునిగి పోయాడా తెలియరాలేదు. స్థానిక గజ ఈతగాళ్లు ,జాలర్లు సహాయంతో కారును బయటకు తీశారు.. విషయం తెలుసుకున్న కూసుమంచి పోలీసులుగా ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తీయాల్సి ఉంది.



