క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా
22 వార్డులకుగాను బీఆర్ఎస్‌కు 10
కాంగ్రెస్ 7, సీపీఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానం
మిత్రపక్షం సీపీఐతో కలిసి చైర్మన్ పీఠం దక్కించుకున్న గులాబీ పార్టీ
కాకతీయ, రామకృష్ణాపూర్: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 22 వార్డులకుగా ను బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానాలు గెలిచారు. సీపీఐ పొత్తుతో మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకోనుంది. స్థానిక సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఆర్డీవో శ్రీనివాస రావు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సమక్షంలో లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రామగుండం పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ కే.శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రతాప్, సీఐ రమేష్, ఎస్సై శ్రీధర్ నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగినట్లు ఆయన తెలిపారు. కాగా గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందించారు.
గెలుపొందిన అభ్యర్ధులు వీరే..
==========================
1) కౌడగాని సాంబయ్య (సిపిఐ)
2) పుల్లూరి తిరుమల (కాంగ్రెస్)
3) మంతెన మల్లమ్మ (కాంగ్రెస్)
4) జుంజుపళ్లి శశి కుమార్ (బీఆర్ఎస్)
5) దాముక శిరీష (కాంగ్రెస్)
6) మద్దెల శంకరయ్య (సీపీఐ)
7) గుర్రం శ్రీనివాస్ (ఇండిపెండెంట్)
8) మీనుగు ముని (సీపీఐ)
9) భీమ మల్లేష్ (కాంగ్రెస్)
10) వీనంక శ్రీనివాస్ (బీఆర్ఎస్)
11) బొమ్మ భూమయ్య గౌడ్ (బీఆర్ఎస్)
12) గోపతి భాగ్య (కాంగ్రెస్)
13) జక్కినబోయిన మంజుల (బీఆర్ఎస్)
14) కొప్పి రాజశేఖర్ (బీఆర్ఎస్)
15) ఆర్నే సంధ్యారాణి (బీఆర్ఎస్)
16) గండమల్ల కృపానందం (బీఆర్ఎస్)
17) గోడిసెల సంధ్యారాణి (బీఆర్ఎస్)
18) పల్లె శ్రీదేవి (కాంగ్రెస్)
19) రంగ లక్ష్మి (బీఆర్ఎస్)
20) కూతురు ప్రభాకర్ (కాంగ్రెస్)
21) బబ్బెరా స్వర్ణలత (బీఆర్ఎస్)
22) మిట్టపల్లి సరిత (సీపీఐ)


