చేర్యాలపై గులాబీ జెండా
బీఆర్ఎస్కు 7, కాంగ్రెస్కు 5 స్థానాలు
కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. మున్సిపాలిటీ పరిధిలో 12 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 స్థానాలను కాంగ్రెస్ ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని ఒగ్గు వెంకటమ్మ తమ సమీప బీఆర్ఎస్ అభ్యర్థిని ఔషర్ల నాగమణి కిష్టయ్యపై 145 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా రెండో వార్డ్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని కమలాపురం గీతాంజలి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని ముస్త్యాల తేజ సంజీవులు పై రెండు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని కొమ్ము రాజేశ్వరి సమీప బిఆర్ఎస్, సిపిఎం అలయన్స్ అభ్యర్థిని ముస్త్యాల లావణ్య ప్రభాకర్ పై 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే క్రమంలో నాలుగో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని నిమ్మ సుప్రజా రాజీవ్ కుమార్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని వంగ జయలక్ష్మి ముకుంద రెడ్డి పై 391 మెజార్టీతో విజయం సాధించగా ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెలుగల దుర్గయ్య సమీప బిఆర్ఎస్ సభ్యర్ధి తోడెంగల రాజేష్ పై 339 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆరో వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిని ముస్త్యాల అరుణ బాలనర్సయ్య సమీప కాంగ్రెస్ అభ్యర్థిని ముస్త్యాల కృష్ణ పై 145 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పోతగంటి ప్రసాద్ సమీప బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్ పై 317 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎనిమిదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బుధారి సురేష్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి భూనాద్రి సురేష్ పై 392 కోట్ల మెజార్టీతో విజయం సాధించగా 9వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి వీరబత్తిని సదానందం సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి నర్ర ఐలయ్య పై 337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా పదో వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిని మేడిశెట్టి ఉమాశ్రీధర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థిని తుమ్మలపల్లి లీల సంజీవులు పై 153 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎండి ఇజాజ్ సమీప కాంగ్రెస్ అభ్యర్థిని గుస్క వాసంతిపై 140 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని ఎండి షరీఫా కాజా సమీప బీఆర్ఎస్ అభ్యర్థిని శివ గారి భబిత అంజయ్య పై 52 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సస్పెండ్ అయిన కానిస్టేబుల్ భార్య విజయం
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై 223 ఓట్ల భారతీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గీతాంజలి విజయం సాధించారు. కాగా.. గీతాంజలి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తుందని ఆమె భర్తను పోలీస్ కానిస్టేబుల్ విధుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో గీతాంజలి ఘన విజయం సాధించడం సంచలనంగా మారింది.


