epaper
Monday, March 2, 2026
epaper

కొడవలి కోత… పంచరైన కారు…

కొడవలి కోత… పంచరైన కారు…
కాంగ్రెస్– సీపీఐ మధ్య పెరిగిన దూరం
బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ… భవిష్యత్‌పై అనిశ్చితి
పొత్తుల వైఫల్యం… రాజకీయ పాఠమా?
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా తీర్పు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనంగా మారింది. పొత్తులు కుదరక ప్రధాన పార్టీలు విడివిడిగా బరిలోకి దిగడంతో ఫలితాలు అనూహ్య మలుపు తీశాయి. క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అదే సమయంలో వామపక్ష పార్టీ సీపీఐ అత్యధిక స్థానాలు గెలిచి ప్రధాన శక్తిగా అవతరించింది. 60 డివిజన్లున్న కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాలకు పరిమితమవగా, సీపీఐ 23 స్థానాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తిన్నది. దీంతో కార్పొరేషన్‌లో స్పష్టమైన ఆధిపత్యం ఏ ఒక్క పార్టీకి దక్కని పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్– సీపీఐ మధ్య పెరిగిన దూరం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్– సీపీఐ పొత్తు భద్రాద్రి జిల్లాలో కీలక విజయాలకు దోహదపడింది. అదే పొత్తు కొనసాగుతుందని భావించినా, కార్పొరేషన్ ఎన్నికల ముందు సీట్ల పంపకంపై విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. పొత్తు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సీపీఐ ఒంటరిగానే బరిలోకి దిగింది. స్థానిక ఎమ్మెల్యే నుంచి కార్యకర్తల వరకు సమన్వయంతో పనిచేయడంతో సీపీఐ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాజకీయంగా తన బలాన్ని చాటింది. ఈ పరిణామం భవిష్యత్తులో కాంగ్రెస్‌కు సవాలుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ… భవిష్యత్‌పై అనిశ్చితి
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 9 స్థానాలకు పరిమితమవడం ఆ పార్టీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీకి ప్రజల మద్దతు తగ్గిన సంకేతాలు ఈ ఫలితాల్లో కనిపించాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌లో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా సిపిఐ పార్టీకి మద్దతు లభిస్తే మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

పొత్తుల వైఫల్యం… రాజకీయ పాఠమా?
ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలక రాజకీయ సందేశాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. పొత్తులు కుదరకపోవడం, అంతర్గత విభేదాలు, స్థానిక స్థాయి అసంతృప్తి వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వామపక్ష పార్టీలను విస్మరించడం కాంగ్రెస్‌కు నష్టం కలిగించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో స్థానిక రాజకీయాల్లో పొత్తుల ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉందని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చే సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img