వెన్నవల్లిలో సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి
స్మశానవాటిక దారి, కాలువలు, సందు రోడ్ల అభివృద్ధికి చర్యలు
కాకతీయ, కల్లూరు : మండలంలోని వెన్నవల్లి గ్రామపంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సర్పంచ్ కంభంపాటి లక్ష్మీ వెంకటేశ్వర్లు చర్యలు చేపడుతున్నారు. గ్రామ స్మశానవాటికకు వెళ్లే దారి సరిగా లేకపోవడం, చెట్లు పెరిగి రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను గుర్తించిన సర్పంచ్, స్వయంగా పర్యవేక్షిస్తూ జంగిల్ వర్క్ చేపట్టిస్తున్నారు. అలాగే కాలువలు సరిగా లేక నీరు నిల్వ ఉండే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కందకాలు తీయించి శుభ్రపరిచే పనులు కొనసాగిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ రోడ్లు లేని సందు రోడ్లకు మట్టి తోలించి సమతలీకరణ పనులు చేయిస్తూ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పిస్తున్నారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుండటంతో గ్రామస్తులు సర్పంచ్ కృషిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉప్పు సుబ్బారావు, కంభంపాటి వెంకటేశ్వర్లు, సుందర్రావు, చిన్నబ్బాయి, మేడి సీతయ్య తదితరులు పాల్గొన్నారు.


