కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు..
కాకతీయ, హనుమకొండ : ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట ప్రాంతాల్లో జరగనున్న నేపథ్యంలో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్.ఎస్ సి.ఆర్.పి.సి 163 సెక్షన్ ప్రకారం ఐదుగురికి మించిన గుంపులు గుమికూడదాన్ని నిషేధించారు. ఈ ఆదేశాలు రేపు ఉదయం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ తెలిపారు. నిషేధాజ్ఞలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


