ప్రశాంతంగా చేర్యాల మున్సిపల్ ఎన్నికలు
83.41 శాతం పోలింగ్ నమోదు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పోలింగ్ ఏర్పాట్లను, భద్రతా చర్యలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వారి వెంట అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి–మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహశీల్దార్ దిలీప్ నాయక్ కూడా పర్యవేక్షణ చేపట్టారు. ఉదయం తొలుత ఓటర్ల రద్దీ కొంత తగ్గుముఖం పట్టినా, మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు గాను 13,777 మంది ఓటర్లు ఉండగా, 11,491 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 83.41గా నమోదైంది. ఇందులో 5,626 మంది పురుషులు, 5,865 మంది మహిళలు ఓటేశారు. ఓటు వేయని వారు 2,286 మంది ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా, ప్రజల తీర్పు ఎవరి వైపు ఉంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఎన్నికల ఫలితాల ద్వారా చేర్యాల మున్సిపల్ అభివృద్ధి దిశ స్పష్టమవు


