epaper
Monday, March 2, 2026
epaper

11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా!

11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా!
రాజ‌కీయ ముసుగులో అరాచ‌కాలు స‌హించం
చందాలు, దందాలు చేస్తే కఠిన చర్యలు
బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదు
కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపిస్తా
ఏదులాపురం ప్రచార ముగింపులో మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

కాకతీయ, కూసుమంచి : రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడితే ఇక సహించేది లేదని, ఎన్నికలు ముగిసిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రత్యర్థులపై ఘాటుగా స్పందించారు. ఎవరైనా ఫోన్లలో బెదిరింపులకు దిగినా, రాజకీయాల పేరుతో దౌర్జన్యాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “11వ తేదీ తర్వాత పరిస్థితి మారిపోతుంది. చందాలు, దందాలు చేస్తే కిందపడుద్ది జాగ్రత్త. తింగరి వేషాలు వేస్తే ఊరుకోం… నేరుగా బొక్కలోకి పంపిస్తాం” అని మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దందాలకు ఇక కాలం చెల్లింది

ప్రచార సమయంలో ప్రత్యర్థులు చేస్తున్న బెదిరింపులపై మంత్రి మండిపడ్డారు. “కారుకూతలు కూస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని తేల్చిచెప్పారు. ఎన్నికలను అడ్డంపెట్టుకుని పాత అలవాట్లు కొనసాగిస్తే కఠిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యర్థి పార్టీల నాయకుల హామీలపై మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. “అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. అధికారం లేకుండా అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసమే” అని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు కొత్తగా నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరే పనులే తమ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.

ఏప్రిల్‌లో ఇందిరమ్మ ఇళ్లు

వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచిందని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడుపేట సర్కిల్ వరకు జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img