epaper
Monday, March 2, 2026
epaper

పేరుకే మున్సిపాలిటీ…

పేరుకే మున్సిపాలిటీ…
దశాబ్దాలుగా ఎన్నికలే లేని మణుగూరు!
మున్సిపాలిటీగా ఉన్నా ప్రజాస్వామ్యం దూరం
ప్రజాప్రతినిధుల్లేని పాలనతో ఇబ్బందులు
కోర్టు కేసులే ప్రధాన అడ్డంకి… కుంటుపడుతున్న అభివృద్ధి

కాకతీయ, మణుగూరు టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం గత ఇరవై ఏళ్లుగా ఎన్నికలు లేకుండానే కొనసాగుతోంది. 2004–05లో మున్సిపాలిటీగా ప్రకటించినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులే లేకపోవడంతో పరిపాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి కౌన్సిల్‌ వ్యవస్థ లేకుండానే అధికారుల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతోంది. వార్డు సభ్యులు, చైర్మన్‌, కౌన్సిలర్లు లేకపోవడంతో ప్రజలకు నేరుగా తమ సమస్యలు వినిపించే వేదిక లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా చిన్న సమస్యలకే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, మణుగూరుకు మాత్రం ఇప్పటికీ మినహాయింపు కొనసాగుతోంది. సమీపంలోని భద్రాచలంలో కూడా కోర్టు కేసుల కారణంగా ఏళ్ల తరబడి ఎన్నికలు జరగకపోయినా, ఇటీవల న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించారు. భద్రాచలానికి సాధ్యమైన ఎన్నికలు మణుగూరుకు ఎందుకు సాధ్యం కావడం లేదన్న ప్రశ్న ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తోంది.

హైకోర్టు కేసులతో నిలిచిన వ్యవస్థ

మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వస్తుందని, అందువల్ల మున్సిపాలిటీ చట్టం ఇక్కడ వర్తించదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ న్యాయపరమైన వివాదాల కారణంగా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మున్సిపాలిటీని రద్దు చేయలేదు, పంచాయతీగా కూడా మార్చలేదు. ఎన్నికలు మాత్రం నిర్వహించడం లేదు. ఫలితంగా మణుగూరు పట్టణం పరిపాలనా పరంగా మధ్యలోనే నిలిచిపోయిన ప్రాంతంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. 1/70 యాక్ట్ వర్తింపుపై స్పష్టత లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

పేరుకుపోతున్న సమస్యలు

ఎన్నికలు లేకపోవడం వల్ల పట్టణంలో అనేక పరిపాలనా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇళ్ల నంబర్లు నవీకరించకపోవడం, ఆస్తుల రికార్డులు సరిచేయకపోవడం వంటి ఇబ్బందులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. మరణించిన వ్యక్తుల పేర్లతోనే ఇప్పటికీ రికార్డులు కొనసాగుతుండటంతో వారసులకు హక్కులు దక్కడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికైన పాలకమండలి లేకపోవడంతో బాధ్యత తీసుకునే ప్రజాప్రతినిధులు లేరని, అధికారులపై జవాబుదారీతనం తగ్గిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల పట్టణం వెనుకబడుతోందని అంటున్నారు. ఎన్నికలు లేకపోతే పట్టణాభివృద్ధి ఎలా సాధ్యమని మణుగూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలన్నా, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నా ఎన్నికైన ప్రతినిధులే అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు లేకపోవడం వల్ల అవినీతి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు ప్రజలు అధికారం కోరడం లేదని, తమ ప్రజాస్వామ్య హక్కు మాత్రమే కోరుతున్నామని తేల్చి చెబుతున్నారు. కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి మున్సిపాలిటీగా కొనసాగిస్తే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పంచాయతీగా మార్చి అయినా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని మణుగూరుకు ఎన్నికల మార్గం సుగమం చేయాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img