epaper
Monday, March 2, 2026
epaper

కాళేశ్వరం దోపిడీకి.. గజ్వేల్ నుంచే గుణపాఠం!

కాళేశ్వరం దోపిడీకి.. గజ్వేల్ నుంచే గుణపాఠం!
కేసీఆర్‌కు ప్రజలు తగిన తీర్పు ఇవ్వాలి
ముంపు బాధితులకు పెండింగ్ ప్యాకేజీలు అమలు చేస్తాం
గజ్వేల్ అభివృద్ధికి అడిగినన్ని నిధులు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

కాకతీయ, గజ్వేల్ : కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్‌కు గజ్వేల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణంతో పాటు నిర్వాసిత గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ఇంచార్జి కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంక్షా రెడ్డితో కలిసి కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల వల్ల సర్వం కోల్పోయిన ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలను త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి అమలు చేయిస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌పై నిప్పులు
కేసీఆర్, హరీష్‌రావుల తప్పుడు నిర్ణయాలతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని అందినంత దోచుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణానికి ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
గజ్వేల్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం అడిగినన్ని నిధులు మంజూరు చేస్తోందని, ఇటీవలే రూ.18 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మహిళల కోసం రూ.50 వేల కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణ నిధులు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గజ్వేల్‌ను అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొనగారి రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img