సీపీఐ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు
డబ్బు రాజకీయాలకు ప్రజలే చెక్ పెట్టాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని, ఈ ఎన్నికలు డబ్బు రాజకీయాలకు చెక్ పెట్టబోతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 53, 59, 60, 15, 49 డివిజన్లలో ఇంటింటి ప్రచారం, రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ ఎన్నికల ముందు మాత్రమే కనిపించే నాయకులతో ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. మోసపూరిత హామీలు, ఖాళీ మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. వందేళ్లుగా ప్రజల మధ్య నిలబడి సేవలందిస్తున్న సీపీఐనే నిజమైన ప్రజా పార్టీ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో సీపీఐ అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగూడెంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. జనరంజక పాలన సీపీఐతోనే సాధ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండానే భరోసా అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి లొంగకుండా ప్రజలు చైతన్యంతో ఓటేయాలని, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థులు బండి నర్సింహా, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి, కనుకుంట్ల శాంతి, బోయిన విజయ్ కుమార్‌తో పాటు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


