హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కాకతీయ, మణుగూరు/ అశ్వాపురం : అశ్వాపురం మండలం చవిటిగూడెం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 6న భాతిక విజయ్ హత్యకు గురైన ఘటనలో అతని సోదరుడు భాతిక అరుణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు విజయ్ మద్యంమత్తులో ఇంటికి వచ్చి తల్లి సత్యవతితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో మంచం కర్రతో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు మణుగూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిపై జరిగిన దాడిని అడ్డుకునే ప్రయత్నంలో తమ్ముడు అరుణ్, అన్న విజయ్‌తో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో విజయ్‌పై దాడి జరగడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


