ట్యాంక్‌బండ్‌పై జాకీర్ హుస్సేన్ విగ్రహం ఏర్పాటు చేయాలి
కాకతీయ, ఖమ్మం : మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ఖమ్మం మైనారిటీ సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖమ్మం ట్యాంక్‌బండ్‌పై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “భారతదేశం నా ఇల్లు, భారతీయులు నా కుటుంబం” అన్న ఆయన మాటలు దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. 1897 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన జాకీర్ హుస్సేన్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా, బీహార్ గవర్నర్‌గా, భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. 1967లో భారత రాష్ట్రపతిగా ఎన్నికై దేశానికి విశిష్ట సేవలు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1963లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఖమ్మం ట్యాంక్‌బండ్‌పై జాకీర్ హుస్సేన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తౌసిఫ్, బద్రుల్లాహ్, సాబీర్, ఖదీర్, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.


