epaper
Monday, March 2, 2026
epaper

ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులే..

ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులే..

సీపీఐ అభ్యర్థులను గెలిపించండి

అధికారం ఉన్నా.. లేకున్నా నిత్యం ప్ర‌జ‌ల వెంటే..

కొత్తగూడెంను కార్పొరేషన్‌గా మార్చిన ఘనత మాదే

సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ

కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్ధులను గెలిపించాల‌ని ఆపార్టీ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శనివారం రామవరంలోని 6 డివిజన్లు, బర్మా క్యాంపు, వ్యూన్ బ‌స్తీ, పాత కొత్తగూడెం ఏరియాల్లోని డివిజన్లలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషాతో కలిసి రోడ్లు, బస్తీ కార్నర్ మీటింగ్‌ల‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎర్రజెండాలతో ఎదురేగి పెద్దఎత్తున హారతులు పట్టారు. ఈసందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారానే పాల్వంచతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని ఓటర్లకు గుర్తు చేశారు. మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరగని పాల్వంచకు ఎన్నికలు జరిపించడమే కాకుండా కొత్తగూడెంను కార్పొరేషన్‌గా మార్చిన ఘనత సీపీఐదే అన్నారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా.. లేకున్నా పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకుల వెంట ఉంటూ వారి సమస్యల కోసం రాజీలేని పోరాటాలు చేస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచిన నాటి నుండి ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయని. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యుర్థుల విజయం అవసరమని తద్వారా అవినీతి రహిత పాలన ప్రజలకు అందుతుందన్నారు.

వారిప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ఎన్నికల వేళ ఊరు, పేరు, అడ్రస్ లేని గుంట నక్కలు ఓట్ల కోసం వస్తున్నాయని అలాంటి వారి వట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి అహంకారానికి నడుమ సాగుతున్నాయని ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికలు పూర్తయిన తర్వాత ముఖం చాటేస్తారని కానీ నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులను గెలిపించుకుంటే అన్ని విధాలా బాగుంటుందన్నారు. స్థానిక సీపీఐ నేతలే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నార‌ని, మనతో నిత్యం ఉండే వారిని గెలిపించుకోవడం అంటే మనల్ని మనం గెలిపించుకున్నట్లే అన్నారు. అధికారం ఎటుంటే ఆ పార్టీ కండువాలు కప్పుకునే వారికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హ‌క్కు లేదన్నారు. అధికారం లేని రోజుల్లో ఈ నాయకులుగా చెప్పుకునే వారు ఏ నాడైనా ప్రజలతో మమేకమయ్యారా అని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ… కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ ప్రజా సంఘాల పోరాటం సత్ఫలితం దిశగా దూసుకుపోతుందని ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి ఎర్ర జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. సిపిఐ అభ్యర్థుల కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయడం ద్వారా అవినీతిని తావులేకుండా చేసిన వారవుతారని చెప్పారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, నలిగంటి శ్రీనివాసరావు, దుర్గరాశి వెంకటేశ్వర్లు, ఎస్కే ఫహీమ్, వీరస్వామి, వాసిరెడ్డి మురళీ, ఉదయ్ భాస్కర్, కందుల భాస్కర్, జిల్లా సమితి సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శాంతిశ్రీ, నాయకులు వాకపల్లి హరినాధ్, గోపి కృష్ణ, జహీర్, ఉల్లోజు వెంకట్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జక్కుల గట్టయ్య, కిరణ్, భవాని, నగేష్, కిలార్ ప్రసాద్ పాటు అభ్యర్ధులు భూక్య శ్రీనివాస్, మునిగడవ పద్మ, కంచర్ల హిమశ్రీ, ఎర్రబెల్లి శంకర్, కనుకుంట్ల సాహితి, కూరపాటి సుధాకర్, పోలమూరి ధనలక్ష్మీ, ఇందిరా ప్రియదర్శిని, వడాల ఆకాంక్ష, మండ నాగలక్ష్మీ, కోలావూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img