చేతన ఫౌండేషన్ ఔదార్యం
గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
దాతల సహకారంతో నూతన అంగన్వాడీ కేంద్రం
కాకతీయ ,కొత్తగూడెం రూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం బాబోజీ తండ గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తూరు గ్రామంలో కొంగర పురుషోత్తంరావు, రామచందర్రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో రూ 1.50 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ కేంద్రం చేపట్టారు. మునియా తండా, సూర్యతండా అంగన్వాడీ కేంద్రాలు రూ.1 లక్ష వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా చేతన ఫౌండేషన్ వారి సహకారంతో నిరుపేద గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెలినా, మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య, పాల్వంచ ప్రాజెక్ట్ సీడీపీవో, లక్ష్మీ ప్రసన్నచేతన ఫౌండేషన్ సభ్యులు దొడ్డ సీతారామయ్య, కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి, సెక్టర్ సూపర్వైజర్ శారద, సర్పంచ్ హాతిరాం, ఉప సర్పంచ్ చందురాణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి, అంగన్వాడి టీచర్ రాణి, గ్రామ పెద్దలు సారయ్య, సమ్మయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.


