30వ వార్డులో కాంగ్రెస్‌కు పెరిగిన బలం
మంత్రి పొంగులేటి సమక్షంలో విపక్షాల వలసలు
కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని కొట్టం శిరీషా రెడ్డి దూకుడుతో ప్రత్యర్థి పార్టీల శిబిరాల్లో అలజడి నెలకొంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ విపక్ష నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతుండటంతో వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. శుక్రవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కీలక చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ కీలక నేత తప్పెట్ల గిడ్జన్ (మున్నా) ఆధ్వర్యంలో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన సుమారు 40 కుటుంబాలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాయి. స్వయంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ పరిణామంతో 30వ వార్డులో విపక్షాల ప్రభావం ఒక్కసారిగా తగ్గిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శిరీషా రెడ్డి వ్యూహాత్మక ప్రచారంతో ప్రత్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెబుతున్నారు. “ప్రజలకు అభివృద్ధి అందించగలిగేది కాంగ్రెస్ మాత్రమే. అందుకే శిరీషా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం” అని చేరికైన నేతలు ప్రకటించారు. కార్యక్రమంలో శిరీషా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


