అభివృద్ధికి కేసీఆర్ మార్గమే సరైనది
కాకతీయ, గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు అభివృద్ధి ఆగకూడదంటే కేసీఆర్ పాలన కొనసాగాల్సిందేనని బీఆర్ఎస్ అభ్యర్థి కొలిచెలిమి భవాని కరుణాకర్ అన్నారు. గురువారం లక్ష్మాపూర్, సంగాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు దేశంలోనే లేని విధంగా గౌరవప్రద పునరావాసం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. పరిహారం మాత్రమే కాకుండా ఇళ్లు, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించి పల్లెలను పట్టణాలుగా మార్చారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే 11వ వార్డులో బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


