చుంచన్నకోట లో చైన్ స్నాచింగ్
కాకతీయ, చేర్యాల:చేర్యాల మండల పరిధిలోని చుంచన్నకోట గ్రామంలో బుధవారం ఓ మహిళ మెడలో ఉన్న గొలుసును దొంగలించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం చుంచన్నకోట గ్రామానికి చెందిన మంద గాలమ్మ (60) వృద్ధురాలు ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి తమ ఇంటికి వచ్చి దాహం వేస్తుంది నీళ్లు ఇవ్వమ్మా అని అడగగా అట్టి వ్యక్తికి త్రాగునిరు ఇవ్వగానే మహిళా మేడలో ఉన్న 2.5 రెండున్నరతులాల బంగారు పుస్తెలా గొలుసును తెంపుకుని ద్విచక్ర వాహనంపై పరారైనట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.


