ఉసిరికాయలపల్లిలో దొంగల హల్చల్
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కిరాణా షాపులు, ఎవరు లేని ఇళ్ళను ఎంపిక చేసుకొని అర్ధరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి, కిటి¿ ఊచలు వంచి ఇండ్లలోకి చొరబడుతున్నారు. గురువారం రాత్రి బాలు కిరాణం, గుగులోత్ అరుణ ఇంటిలో చోరి జరిగి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి పోలీసులకు పిర్యాదుచేయనున్నట్లు బాధితులు తెలిపారు.


