epaper
Monday, March 2, 2026
epaper

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య

కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా పారదర్శక వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పూర్తి బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఏఈఓలు, తహసీల్దార్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్, వీడియో వ్యూయింగ్ టీములు (వి‌వీటీ)లతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, బహుమతులు తదితర ప్రలోభకర అంశాల పంపిణీని అడ్డుకునేందుకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ప్రచార సామగ్రి ర్యాలీలు సభలు పత్రికా ప్రకటనలు సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని అంశాలపై సమగ్ర అవగాహనతో పర్యవేక్షణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి ఖర్చును ఖచ్చితంగా నమోదు చేసి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఖర్చుల ఖాతాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని బృందాలు ప్రతిరోజూ నిర్వహించిన తనిఖీలు, స్వాధీనాలు, నమోదైన కేసులు తదితర వివరాలతో కూడిన రోజువారీ నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని చేపట్టిన ప్రతి చర్యను ఖచ్చితంగా నమోదు చేసి స్వాధీనాల వివరాలను అధికారిక రికార్డుల్లో పొందుపరచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో ఎటువంటి చిన్న నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎన్నికల నిర్వహణకు నియమిత వివిధ బృందాల సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img