సముద్రాల గాయత్రి సైతం ఎన్నికల్లో..
కాకతీయ కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 30వ తేదీన భారతీయ జనతా పార్టీ 56వ డివిజన్ అభ్యర్థి సముద్రాల గాయత్రి ఆర్. ఎం. పి తన నామినేషన్‌ను దాఖలు చేశారు.. కొత్తగూడెం బీజేపీ ఎలక్షన్ ఇన్చార్జ్ గొడుగు శ్రీధర్ , మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముత్యాల హనుమంత రావు, గుమలాపురం సత్యనారాయణ నేతృత్వంలో తాను బిజెపిగా పోటీ చేస్తున్నానని ప్రజలు ఆదరించి అభిమానం పొందితే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు సముద్రాల గాయత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


