రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, తుంగతుర్తి : తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల ఎంపికల్లో వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిర్రకీర్తన, గౌరు అక్షయ్ కుమార్ ఉత్తమ ప్రతిభ కనబర్చి 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు. క్రీడా పాఠశాలలో చదువుతోపాటు అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్ తదితర 11 క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తారని తెలిపారు. విద్యతోపాటు క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.


