epaper
Thursday, January 15, 2026
epaper

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!
సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది
బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తారా?
జర్నలిస్టుల అరెస్టులు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం
రైతుబంధు–రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం

కాకతీయ, జహీరాబాద్ : సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉందని, తెలంగాణ ప్రజలకు విప్లవాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు ముందు ఉద్యమ క్రాంతి, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
సంక్రాంతి లాంటి ఆనందపు పండుగ వేళ అన్నదాతలను ఆందోళనలోకి నెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా రైతులను ఇబ్బందుల పాలుచేస్తోందని ఆరోపించారు. సగానికి సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని, ఎండకు, చలికి లైన్లలో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యాప్‌లు, మ్యాప్‌లు, కార్డుల పేరుతో రైతుల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

రైతు బాంధవుడు కేసీఆర్

కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు వేసి రైతు బాంధవుడిగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, చెరువులు–ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించినది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అంటూనే 12 గంటలే ఇస్తోందని, రెండు పంటలకు రైతుబంధు, ఒక పంటకు బోనస్ ఇచ్చి మరోదానికి ఎగ్గొట్టిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి బండ్లపై చలాన్లు పడితే బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు కట్ చేయాలని చెప్పడం ప్రమాదకరమని అన్నారు. ప్రజలకు తెలియకుండా ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేవాళ్లను సైబర్ నేరగాళ్లు అంటారని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వారికి పెద్ద తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల వేళ ఓట్ల కోసం చీరలు, రైతుబంధు పంచుతారని విమర్శిస్తూ.. కేసీఆర్ నాట్లకు నాట్లకు రైతుబంధు, బతుకమ్మకు చీరలు ఇచ్చారని తేడాను స్పష్టం చేశారు.
జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మీడియాను బ్లాక్‌మెయిల్ చేయడం, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు, ఎస్సీ–ఎస్టీ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడిన బైక్ ఒకే...

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్ కాకతీయ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి జిల్లా...

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి గణపురం ఆనకట్ట ఆధారంగా వేల ఎక‌రాల సాగు ప్ర‌భుత్వం...

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి.. ఎల్లారెడ్డిలో...

Sircilla: సిరిసిల్ల కలెక్టర్‌పై వేటు..సంబురాలు చేసుకున్న నాయకులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచిన సిరిసిల్ల కలెక్టర్...

Maoist: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి...

ఇలా తయారయ్యారేంట్రా.. బర్రె దూడపై అత్యాచారం..!!

కాకతీయ, మెదక్: కామాంధుల వికృత చేష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే కాదు,...

Chicken: భార్య చికెన్ వండలేదని సూసైడ్ చేసుకున్న భర్త..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, గోళ్లవిడిసిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img