జాతీయ బాస్కెట్‌బాల్‌కు కరీంనగర్ త్రయం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా బాస్కెట్‌బాల్‌లో మరోసారి తన సత్తా చాటింది. అంబేద్కర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న ముగ్ధ హాసిని, మడక అక్షయా, భాగ్యనగరం సిద్ధార్థ్ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జనవరి 11 నుంచి 16 వరకు జరగనున్న 69వ ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలురు, బాలికల జాతీయ పోటీల్లో వీరు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరి ఎంపికపై డీవైఎస్‌ఓ శ్రీనివాస్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, కోచ్ అరుణ్ తేజ్, పర్మిత హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులు జాతీయ వేదికపై మెరుగైన ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


