యువతకు క్రీడలే సరైన దారి
: ఎస్సై రమణారెడ్డి
మైలారం యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ
ఐదు మండలాల స్థాయిలో క్రీడా పోటీలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మైలారం యూత్ ఆధ్వర్యంలో ఐదు మండలాల స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుమూల ప్రాంతంలో ఇంత పెద్దస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా యువత మత్తు పానీయాలు, సిగరెట్లు, డ్రగ్స్, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండగలరని చెప్పారు. వాలీబాల్ వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని పెంపొందిస్తాయని, యువతలో స్నేహభావం, క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. గ్రామ పెద్దలు, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలకు ఉత్సాహం నింపారు.


