జనవరి 11న టేకు వృక్షాల వేలం
సిరిపురం పాఠశాల ప్రాంగణంలో నిర్వహణ
మదిర ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు
కాకతీయ, ఖమ్మం : మధిరలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ప్రభుత్వ ఐటిఐ కళాశాల నిర్మాణానికి సంబంధించిన టేకు వృక్షాల వేలం పాటను జనవరి 11న నిర్వహించనున్నట్లు మధిర ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఐటిఐ కళాశాల నిర్మాణానికి భూమి కేటాయించగా, అక్కడ ఉన్న 40 టేకు మరియు ఇతర వృక్షాల తొలగింపునకు గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 11న ఉదయం 10 గంటలకు సిరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వేలం పాట జరుగుతుందని, ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆయన కోరారు.


