గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్‌కు నూతన కమిటీ
ఖమ్మంలో సర్వసభ సమావేశం
రాష్ట్ర నేతల సమక్షంలో ఎన్నిక
ఉద్యోగ హక్కుల కోసం సమిష్టి పోరాటం
జిల్లా కమిటీ ప్రకటించిన ట్రెసా నేతలు
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన సర్వసభ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా అధ్యక్షత వహించారు. సర్వసభ అనంతరం జిల్లా నూతన కమిటిని ట్రెసా జిల్లా అధ్యక్షులు తుంబూరి సునీల్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గ్రామ పాలన ఆఫీసర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యూనియన్ బలంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత, సంక్షేమం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాస్, ట్రెసా జిల్లా అధ్యక్షులు తుంబూరి సునీల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి జయపాల్, ట్రెసా రాష్ట్ర కోశాధికారి బొగ్గవరపు వెంకటేశ్వరరావు, ట్రెసా జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నేటి వీర వెంకట ప్రసాద్, మహిళా విభాగం వసంత, TGPOs రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర ఉపాధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు, జిల్లా బాధ్యులు మలీద వెంకట్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కమిటీ వివరాలు
జిల్లా అధ్యక్షులు: మన్నే గురుమూర్తి
జిల్లా ప్రధాన కార్యదర్శి: చిమట వీరబాబు
కోశాధికారి: షేక్ జమాల్
వర్కింగ్ ప్రెసిడెంట్లు: షేక్ అన్వర్ పాషా, బానోతు రవికుమార్
మహిళా అధ్యక్షురాలు: మాటూరి మమత
మహిళా కార్యదర్శి: తూమాటి శైలజ
అసోసియేట్ అధ్యక్షులు: నెల్లూరి లవన్ కుమార్
జిల్లా ఉపాధ్యక్షులు : కొండబాల వెంకటేశ్వర్లు, ఆరెపుల రమేష్, సింగిరెడ్డి దయాకర్ రెడ్డి, తేజవత్ కేసియా, చంద్రన్న గౌడ్, మెంటం శ్రీను, మానుకొండ సంపత్ కుమార్, ఆంగోతు ఉపేందర్, వడ్డె బోయిన ఉపేందర్



