epaper
Monday, March 2, 2026
epaper

మృత్యువులోనూ వీడని బంధం!

మృత్యువులోనూ వీడని బంధం!
బోనకల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో వైరా దంప‌తులు మృతి
ఇటీవలే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన మ‌హిళ‌
చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషింకుంటున్న‌ భర్త
రోడ్డు ప్ర‌మాదం రూపంలో బ‌తుకుల‌ను క‌డ‌తేర్చిన విధి
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు
వైరా టీచ‌ర్స్ కాల‌నీలో విషాద చాయ‌లు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జీవితాన్ని సాగిస్తున్న భార్యాభర్తలను మృత్యువు ఒకే క్షణంలో కబళించింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు… మృత్యువులోనూ ఆ దంపతుల బంధాన్ని విడదీయలేకపోయింది. తల్లిదండ్రుల దుర్మరణంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఖ‌మ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు దుర్మరణం చెందారు.

ఒక్క ప్రయాణం… రెండు ప్రాణాలు

వడ్డాది రాము గ్రామాల్లో తిరుగుతూ పరుపుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన సతీమణి వెంకటరత్నం ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగానే వ్యాపారం ముగించుకున్న రాము, సతీమణి వెంకటరత్నాన్ని తన ట్రాలీ ఆటో క్యాబిన్‌లో కూర్చోబెట్టుకొని జగ్గయ్యపేట నుంచి వైరాకు బయలుదేరాడు. సోమవారం గ్రామ సమీపంలో వైరా నుంచి బోనకల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన రామును సమాచారం అందుకున్న వైరా ఎస్సై పుష్పాల రామారావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాము కూడా మృతి చెందాడు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథ‌లుగా మారారు. కేసు నమోదు చేసిన వైరా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల దుర్మరణంతో వైరా టీచర్స్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రాము–వెంకటరత్నం దంపతుల భౌతికకాయాలను పలు రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, కాంగ్రెస్ నాయకులు కట్ల సంతోష్, కట్ల నాగరాజు, పర్సా రవి తదితరులు దంపతులకు చివరి నివాళులు అర్పించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img