వెలుగుమట్ల అర్భన్ పార్క్ కు కొత్త పేరు
మంచి ట్యాగ్‌లైన్ సూచించిన వారికి బహుమతి
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు కొత్త పేరు, ట్యాగ్ లైన్ సూచించి, నాలుగు వేల రూపాయల బహుమతి గెలుచుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి వెలుగుమట్ల అర్బన్ పార్క్ పబ్లిక్ కాంపిటీషన్ గోడప్రతిని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వెలుగుమట్ల అర్బన్ పార్కుకు కొత్త పేరు, ట్యాగ్ లైన్, అధికారిక లోగో తయారు చేయాలని అటవీ శాఖ నిర్ణయించిందని, ఇందులో భాగంగా పబ్లిక్ కాంపిటీషన్ చేపడుతున్నట్లు తెలిపారు. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు పబ్లిక్ కాంపిటీషన్ ఉంటుందని, ఆసక్తి గలవారు వెలుగుమట్ల అర్బన్ పార్కుకు కొత్త పేరు ట్యాగ్ లైన్ సూచించాలని, విజేతలకు 4 వేల రూపాయల బహుమతి లభిస్తుందని అన్నారు. అలాగే వెలుగుమట్ల అర్బన్ పార్కు కొత్త అధికారిక లోగో డిజైన్ చేసే వారికి కూడా 4 వేల రూపాయలు బహుమతి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఎఫ్డివో మంజుల, తహసీల్దార్లు, ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


