పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం : పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్హెచ్ఓలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, రైటర్లు, టెక్ టీం ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తితే డీసిఆర్బీ అధికారులకు తెలియజేసి వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కేసు నమోదయినప్పటి నుండి పరిష్కారం అయ్యే వరకు ప్రతీ విషయాన్ని ఆన్లైన్లో పొందుపరిచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు. ఆన్లైన్లో పొందుపరిచే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఐటీ సెల్ సహకారం తీసుకోవాలని అన్నారు. 5 ఎస్ అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేసులకు సంభందించిన ఫైళ్ళను క్రమపద్దతిలో అమర్చుకోవాలని సూచించారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ రాము, ఇల్లందు ఇన్స్పెక్టర్ సురేష్, 3టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్, ఫింగర్ ప్రింట్స్ సీఐ అశోక్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.


