epaper
Monday, March 2, 2026
epaper

ఇక ఖ‌మ్మంలో రాజ‌కీయ పోరాట‌మే

ఇక ఖ‌మ్మంలో రాజ‌కీయ పోరాట‌మే
ప‌రిపాల‌న‌లో కాంగ్రెస్ పూర్తిగా వైఫ‌ల్యం
నీళ్ల కుట్రలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అజాగ్రత్త
యూరియా బ‌స్తాలంద‌క రైతుల‌ కష్టాలు కొన‌సాగుతున్నాయి
అధినేత‌ కేసీఆర్ హెచ్చరికలు నిజమ‌వుతున్నాయి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఈ నూతన సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో పోరాటాల నామసంవత్సరంగా నిలవనుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్క రోజు కేసీఆర్ ప్రెస్ నోట్ విడుదల చేయగానే కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలవడం వారి వైఫల్య పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు అందించిన చరిత్ర ఉందని, అదే స్థాయిలో పాలన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. రానున్న అన్ని ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బీఆర్ఎస్ ఘన విజయాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ కుట్ర‌ల‌పై బీఆర్ఎస్ పోరాటం

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులపై పంపులను ఆన్ చేసి సీతారామ ప్రాజెక్టు నీళ్లను రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ, తదుపరి పనులను మాత్రం ముందుకు సాగనీయకపోవడం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అజాగ్రత్త త్వరలోనే నీళ్ల ఉద్యమంగా మారడం ఖాయమని హెచ్చరించారు.
ఖమ్మం నియోజవర్గంలో ఎన్నికల సమయంలో “సీతారామ నీళ్లతో కడుగుతా” అని హామీ ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ముందే చేసిన హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రతి తెలంగాణ బిడ్డకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు.

కేటీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను సత్కరిస్తూ జిల్లా పర్యటనలు చేస్తున్నారని అజయ్ కుమార్ తెలిపారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఖమ్మం జిల్లాకు రానున్నారని, జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లా సర్పంచులు, వార్డు మెంబర్లను ఘనంగా సత్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img