కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి
జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణిలో కారుణ్య నియామకాలు, టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ నుంచి అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల వివరాలు, ఇప్పటికే కారుణ్య నియామకం పొందిన ఉద్యోగుల వారసుల వివరాలను ఈపీఆర్‌లో నమోదు చేసే ప్రక్రియ పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో జాప్యం సహించబోమని స్పష్టం చేశారు.
నెలవారీ నివేదికలు సకాలంలో పంపాలి
క్వార్టర్స్ స్థితిగతులు, నెలవారీ క్వార్టర్ కౌన్సెలింగ్ విధానం, గ్రాట్యుటీ చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. కారుణ్య నియామకాలు, టెర్మినల్ బెనిఫిట్స్, క్వార్టర్ కౌన్సెలింగ్, గ్రాట్యుటీ అంశాలకు సంబంధించి నెలవారీ నివేదికలను తప్పనిసరిగా సకాలంలో పంపాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు సీఎంపీఎఫ్–సీపీఆర్‌ఎంఎస్‌కు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని సింగరేణి మాజీ ఉద్యోగులు, తమ మొబైల్ ఫోన్‌లోని ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా లేదా స్వయంగా సీఎంపీఎఫ్–సీపీఆర్‌ఎంఎస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. అవసరమైతే సమీప మీసేవ కేంద్రాల్లో కూడా సర్టిఫికెట్ అందజేయవచ్చని, తద్వారా పెన్షన్, వైద్య సేవలు నిరాటంకంగా పొందవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్‌తో పాటు డీజీఎం(పర్సనల్)లు బి. శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, డీవైపీఎం కె. సునీల్ కుమార్, సీనియర్ పీఓ ఎం. శ్రీనివాస్, కమ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్. సుజ్ఞాన్, అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.


