epaper
Thursday, January 15, 2026
epaper

ప్రధానిని గౌరవించలేని రాజకీయమా?

ప్రధానిని గౌరవించలేని రాజకీయమా?
సోనియా–రాహుల్ భజన తప్ప దేశభక్తి లేదా?
విదేశీ సిద్ధాంత బానిసత్వానికి కూనంనేని మాటలే నిదర్శనం
మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ… దేశ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిని గౌరవించలేని రాజకీయ ఆలోచన ప్రజాస్వామ్యానికి ప్రమాదమని మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన తప్ప దేశ గౌరవం తెలియని రాజకీయమే కూనంనేనిదని విమర్శించారు. విదేశీ సిద్ధాంతాలకు బానిసలై, పక్క పార్టీలకు సొత్తులా మారిన నేతలు దేశభక్తిపై మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేగా, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి… దేశ ప్రధాని మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు.

పేరు మార్పు కాదు… పేదల తలరాత మారే చట్టం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్‌గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ చట్టంపై ప్రతిపక్షాలు కావాలనే అపోహలు సృష్టిస్తున్నాయని నెల్లూరి ఆరోపించారు. పేరు మార్చారని మాత్రమే గగ్గోలు పెడుతున్నారని, కానీ ఇందులో దాగున్న పేదల భవిష్యత్తు మార్పును గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచి పేదలకు మోదీ గ్యారెంటీ ఇచ్చారని గుర్తుచేశారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు ఢిల్లీ నుంచి వస్తున్నాయన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, గ్రామ సభలు–పంచాయతీలే తమ అవసరాలను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ఈ చట్టం కల్పించిందని స్పష్టం చేశారు.

రైతులు–కూలీల సమతుల్యతకు కేంద్ర నిర్ణయాలు

వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించిందని తెలిపారు. అందుకే విత్తనాలు నాటే సమయంలో లేదా కోతల కాలంలో ఏడాదికి 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. దీని వల్ల రైతులు, కూలీల మధ్య సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహణ వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. దీని ద్వారా వారికి సకాలంలో వేతనాలు, మెరుగైన శిక్షణ లభిస్తుందని తెలిపారు.

క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదు

గ్రామాల్లో మౌలిక వసతులు, మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని నెల్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం, వేతనాల ఆలస్యానికి పరిహారం వంటి నిబంధనలను బలోపేతం చేసిన విషయాన్ని కూనంనేని తెలుసుకోవాలని సూచించారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు సుదర్శన్ మిశ్రా, బండారు నరేష్, వీరవల్లి రాజేష్, నెల్లూరు బెనర్జీ, రవి రాథోడ్, రవి గౌడ్, గడిల నరేష్, కోట మూర్తి, అల్లిక అంజయ్య, మనీ, వంశీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img