మాలలు రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలి
కాకతీయ, కొత్తగూడెం : మాలలు రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా పాల్గొని రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని కొమరం భీం భవన్‌లో మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావిత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది అమలైతే దేశంలోని 93 శాతం అణగారిన వర్గాలను మళ్లీ బానిసలుగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాలల ఐక్య వేదిక కన్వీనర్ బరగడి దేవదానం, కో–కన్వీనర్ శనగ వెంకటేశ్వర్లు, అడ్వకేట్ డి.శోభారాణి, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, రమణమూర్తి, ఇన్నయ్య, రిటైర్డ్ విద్యాశాఖాధికారి ఫ్రాన్సిస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుర్రం లక్ష్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం, ప్రిన్సిపాల్ దాసరి రమేష్, జూనియర్ లెక్చరర్ వరద ప్రభాకర్తో పాటు పలువురు మేధావులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


