ఆర్యవైశ్య నేతలకు సంఘం ఆధ్వర్యంలో సత్కారం
సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ప్రత్యేక అభినందనలు
సామాజిక సేవలో ముందుండాలని పిలుపు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, వివిధ హోదాలు పొందిన ఆర్యవైశ్య నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందజేశారు. నేలకొండపల్లి మండలం రాజారంపేట సర్పంచ్ రాయపూడి రామారావు, నేలకొండపల్లి వార్డు సభ్యులు వంగవీటి పవన్ కుమార్, రాయపూడి రోహిత్, రాజేశ్వరపురం వార్డు సభ్యురాలు పెనుగొండ పద్మావతి, భానాపురం వార్డు సభ్యురాలు ఆత్మకూరి ఉదయలక్ష్మి, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి తదితరులను ప్రత్యేకంగా సత్కరించారు.
సామాజిక బాధ్యత మరింత పెరిగింది
ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పసుమర్తి చందర్ రావు మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆర్యవైశ్యులు సామాజిక, ఆర్థిక, సేవా రంగాల్లో మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


