సావిత్రిబాయి పూలే ఆశయాలు ఆదర్శం కావాలి
కాకతీయ, కొత్తగూడెం : దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త మాతా సావిత్రిబాయి పూలే అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ పేర్కొన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు సావిత్రి బాయి ఫూలే ఆశయాలు, లక్ష్యాలను ఆచరించాలనుకునే ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని అధ్యయనం చేయాలన్నారు. దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలేను గుర్తించి గర్వించాలన్నారు. నేటి యువతీ–యువకులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, వినయ్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, భూక్యా కవిత, నీలా, ఇస్లావత్ భారతి తదితరులు పాల్గొన్నారు.


