250 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : ట్రాఫిక్ ఏసీపీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నూతన సంవత్సరం సందర్భంగా బుధ, గురు, రెండు రోజుల్లో నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని, నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 76 మంది వాహనదారులతో పాటు కమిషనరేట్ వ్యాప్తంగా 250 మందిపై కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ఆకస్మికంగా రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ….మద్యం మత్తులో పట్టుబడిన వారిపై న్యాయస్థానాల్లో ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇటీవల మద్యం సేవిస్తూ తనిఖీల్లో పట్టుబడిన వారికి శిక్ష విధించడంతో పాటు మరికొందరి రెండు వేల నుండి మూడు వేల వరకు జరిమానా విధించారని తెలిపారు.


