అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కౌంటర్ ప్రారంభం
ఖమ్మం ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం
ఇబ్బందుల్లేని సేవలు అందించాలి : రీజినల్ మేనేజర్ ఏ. సరి రామ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం నూతన బస్టాండ్‌లో ప్రత్యేక అడ్వాన్స్ టికెట్ బుకింగ్ (రిజర్వేషన్) కౌంటర్‌ను ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరి రామ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు త్వరితగతిన, పారదర్శకంగా టికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్, భద్రాచలం డిపో మేనేజర్ జంగయ్యతో పాటు బస్టాండ్ కంట్రోలర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కౌంటర్‌తో ఖమ్మం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని అధికారులు తెలిపారు


