పైపులైన్ పగలడంతో తాగునీరు వృథా
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివారులో శుక్రవారం ప్రధాన మంచినీటి పైపులైన్ పగిలి భారీగా నీరు వృథా అయింది. రామగుండం నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటిని తరలించే కీలక పైపులైన్ మానేరు వాగు ఒడ్డున విరిగిపోవడంతో భారీ ఒత్తిడితో నీరు ఆకాశంలోకి ఉధృతంగా ఎగసిపడింది. అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద ప్రాంతంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. పగిలిన పైపులైన్ మరమ్మతులకు ఏర్పాట్లు చేపట్టామని, దెబ్బతిన్న భాగాన్ని త్వరితగతిన మార్చి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.


